Friday, 6 February 2026
  • Home  
  • మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా*
- విశాఖపట్నం

మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా*

*మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా* *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్కూల్ ఆవరణలో శుక్రవారం జరిగిన పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో ఏం కావాలనేది స్కూల్ దశలో నిర్ణయించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువులు, స్కూల్, ఊరు, జిల్లా, రాష్ట్రం గర్వపడేలా ఉన్నత స్థానానికి చేరుకుని, మంచి పేరు తెచ్చుకోవాలని హితబోధ చేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూరుస్తున్న ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ను గంటా అభినందించారు. కేజీబీవీ విద్యార్థిని మాట్లాడుతూ తాను బాగా చదువుకుని ఐ.ఎ.ఎస్. అవుతానన్నారు. అంతకు ముందు స్కూల్ ప్రాంగణంలో బుద్ధుడు, మదర్ థెరిస్సా విగ్రహాలను ఆవిష్కరించారు. స్కూల్ లో అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగమణి, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గాడు వెంకటప్పడు, కురుమిన లీలావతి, పాండ్రంగి అప్పలరాజు, గండ్రెడ్డి సోమినాయుడు, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, మహంతి శివాజీ, అంగటి రాము తదితరులు పాల్గొన్నారు.

*మోడల్ స్కూల్ గా కేజీబీవీ*

*పి.టి.ఎం.లో గంటా*
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *
ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్కూల్ ఆవరణలో శుక్రవారం జరిగిన పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో ఏం కావాలనేది స్కూల్ దశలో నిర్ణయించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువులు, స్కూల్, ఊరు, జిల్లా, రాష్ట్రం గర్వపడేలా ఉన్నత స్థానానికి చేరుకుని, మంచి పేరు తెచ్చుకోవాలని హితబోధ చేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూరుస్తున్న ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ను గంటా అభినందించారు. కేజీబీవీ విద్యార్థిని మాట్లాడుతూ తాను బాగా చదువుకుని ఐ.ఎ.ఎస్. అవుతానన్నారు. అంతకు ముందు స్కూల్ ప్రాంగణంలో బుద్ధుడు, మదర్ థెరిస్సా విగ్రహాలను ఆవిష్కరించారు. స్కూల్ లో అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగమణి, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గాడు వెంకటప్పడు, కురుమిన లీలావతి, పాండ్రంగి అప్పలరాజు, గండ్రెడ్డి సోమినాయుడు, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, మహంతి శివాజీ, అంగటి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.