Wednesday, 25 March 2026
  • Home  
  • మోంథా తుఫాన్ నష్ట పరిహారం అందించాలి,జీ.కే. వీధి మండల టి. ఎన్. ఎస్. ఎఫ్
- అల్లూరి సీతారామరాజు

మోంథా తుఫాన్ నష్ట పరిహారం అందించాలి,జీ.కే. వీధి మండల టి. ఎన్. ఎస్. ఎఫ్

జి. కె. వీధి పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30: మోంథా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలను ఆదుకోవడంలో కృషి చేసిన జీ.కె. వీధి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి జీ.కే. వీధి మండల తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టి. ఎన్ ఎస్. ఎఫ్) తరపున జిల్లా టి. ఎన్ ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి కృతజ్ఞతలు తెలియజేశారు.తుఫాన్ సమయంలో ప్రజల క్షేమం కోసం పని చేసిన అన్ని శాఖల సిబ్బందికి, ముఖ్యంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన జీ.కే. వీధి మండల పత్రిక విలేకరులకు, సామాజిక సేవా కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, మండలంలోని 16 పంచాయతీలలో మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన మరియు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణమే ప్రభుత్వం తరపున తగిన నష్ట పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి జిల్లా అధికారులను కోరారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం మరియు ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేసి, బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కాలి కళ్యాణి విజ్ఞప్తి చేశారు.

జి. కె. వీధి పున్నమి ప్రతినిధి అల్లూరి జిల్లా అక్టోబర్ 30:

మోంథా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలను ఆదుకోవడంలో కృషి చేసిన జీ.కె. వీధి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి జీ.కే. వీధి మండల తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టి. ఎన్ ఎస్. ఎఫ్) తరపున జిల్లా టి. ఎన్ ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి కృతజ్ఞతలు తెలియజేశారు.తుఫాన్ సమయంలో ప్రజల క్షేమం కోసం పని చేసిన అన్ని శాఖల సిబ్బందికి, ముఖ్యంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన జీ.కే. వీధి మండల పత్రిక విలేకరులకు, సామాజిక సేవా కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, మండలంలోని 16 పంచాయతీలలో మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన మరియు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణమే ప్రభుత్వం తరపున తగిన నష్ట పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి జిల్లా అధికారులను కోరారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం మరియు ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేసి, బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని టి. ఎన్. ఎస్. ఎఫ్ కార్యదర్శి ముక్కాలి కళ్యాణి విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.