ప్రళయ భీకరంగాదూసుకొస్తున్న మోంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్ల ను అప్రమత్తం చేయడం, ముందస్తు సహాయక చర్యలను చేపట్టడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజలు తమ వంతు బాధ్యతగా తుఫాను తీవ్రత పట్ల అత్యంత జాగ్రత్తతో వ్యవహరించి, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే కదిలి పలు జిల్లాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రైతాంగం, పట్టణ ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యల కు తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతోముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మోంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – సిపిఐ నేత దోనేపూడి శంకర్
ప్రళయ భీకరంగాదూసుకొస్తున్న మోంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్ల ను అప్రమత్తం చేయడం, ముందస్తు సహాయక చర్యలను చేపట్టడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజలు తమ వంతు బాధ్యతగా తుఫాను తీవ్రత పట్ల అత్యంత జాగ్రత్తతో వ్యవహరించి, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే కదిలి పలు జిల్లాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రైతాంగం, పట్టణ ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యల కు తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతోముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

