ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
మొర్రాయిపల్లె గ్రామానికి చెందిన లక్కడి నరేష్ వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అంజిరెడ్డి, కృష్ణారెడ్డి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శ దంపతులుగా నిలవాలని వారు ఆశీర్వదించారు.
వివాహ వేడుకలో పలువురు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, యువకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాదరంగా నిర్వహించబడింది.


