ముస్తాబాద్/ ఏప్రిల్ 13 / పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియం భవనం మొదటి దశలోనే నిలిచిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
భవనం ఎదురుగా కస్తూర్బా బాలికల పాఠశాల, పక్కనే ప్రభుత్వ ఇంటర్ పాఠశాల, గురుకుల పాఠశాలలు మరియు ఈ భవనం ఎడమ పక్కన సమ్మక్క సారక్క దేవాలయం. ఉన్నాయి ఈ ప్రాంతంలో విద్యార్థుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భవనం పూర్తికాకపోవడంతో స్థానికులు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు భవనం నిర్మాణం ప్రారంభించి ఐదు సంవత్సరాలు కావస్తున్న నిర్మాణం పూర్తి కాలేదు
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, అధికారుల పర్యవేక్షణ లోపమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక నాయకులు ప్రభుత్వ సహాయం తీసుకుని. పాలకులు మరియు మేధావులుఈ ఆడిటోరియం. పనులను వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేసి ఈ జ్ఞాన బాండగారాన్ని. విద్యార్థులకు మేధావులకు.ప్రజలకు చిరు కానుకగా. ఇవ్వాలని మండల స్థానిక ప్రజలు కోరుతున్నారు.

