మొజాంబిక్ బైరా పోర్ట్ సమీపంలో భారతీయులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది భారతీయులలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికితీయగా, గల్లంతైన వారి కోసం సముద్రంలో రెస్క్యూ బృందాలు శోధిస్తున్నాయి. ప్రమాదానికి అధిక అలలు, ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొజాంబిక్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ రక్షణ చర్యలు పర్యవేక్షిస్తోంది. గల్లంతైన వారిని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని మొజాంబిక్ ప్రభుత్వం ఆదేశించింది.

మొజాంబిక్ తీరంలో బోటు ప్రమాదం “ముగ్గురు భారతీయులు మృతి, ఐదుగురి గల్లంతు”