*మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి*
———–_—————
*సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్*
________________
(స్టే)ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను సిపిఎం బృందం పరిశీలించింది అనంతరం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ నిన్నటి తుఫాన్ తో నోటి కాడికి వచ్చిన పంట నీట మునిగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారని అన్నారు భారీ వర్షం 24 గంటల పాటు విపరీతంగా వర్షం పడటంతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని వరి ధాన్యం పూర్తిగా నీట మునిగిందని అన్నారు ఇప్పుడే పత్తులు ఏరే క్రమం ఉండడంతో వర్షం పడడంతో పూర్తిగా పత్తి మొక్కజొన్న పంటలు కరాబైన పరిస్థితి ఉందన్నారు అలాగే మిగతా పంటలు మొత్తము నీటిలో మునిగిపోయాయని అన్నారు రైతులు ఎన్నో ఇబ్బందులు పడి పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకుని పంటలు చేతికొచ్చిన తరుణంలో తుఫాన్ వల్ల పంటలను నష్టపోయాయని అన్నారు ఐకెపి సెంటర్ల దగ్గర పోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని ఏ షరతులు లేకుండా ఐకెపి సెంటర్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నష్టపోయిన *ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టంపై అంచనా వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో* *సిపిఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు తోడంగల ఐలయ్య మంద మహేందర్ శాఖ కార్యదర్శి నాయకులు రైతులు వంగపండ్ల సోమయ్య దైద కుమార్ లింగనబోయిన రాజు మంద మొగిలి వారాల లింగయ్య ఆరుట్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు

మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి*
*మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి* ———–_————— *సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్* ________________ (స్టే)ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను సిపిఎం బృందం పరిశీలించింది అనంతరం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ నిన్నటి తుఫాన్ తో నోటి కాడికి వచ్చిన పంట నీట మునిగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారని అన్నారు భారీ వర్షం 24 గంటల పాటు విపరీతంగా వర్షం పడటంతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని వరి ధాన్యం పూర్తిగా నీట మునిగిందని అన్నారు ఇప్పుడే పత్తులు ఏరే క్రమం ఉండడంతో వర్షం పడడంతో పూర్తిగా పత్తి మొక్కజొన్న పంటలు కరాబైన పరిస్థితి ఉందన్నారు అలాగే మిగతా పంటలు మొత్తము నీటిలో మునిగిపోయాయని అన్నారు రైతులు ఎన్నో ఇబ్బందులు పడి పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకుని పంటలు చేతికొచ్చిన తరుణంలో తుఫాన్ వల్ల పంటలను నష్టపోయాయని అన్నారు ఐకెపి సెంటర్ల దగ్గర పోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని ఏ షరతులు లేకుండా ఐకెపి సెంటర్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నష్టపోయిన *ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టంపై అంచనా వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో* *సిపిఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు తోడంగల ఐలయ్య మంద మహేందర్ శాఖ కార్యదర్శి నాయకులు రైతులు వంగపండ్ల సోమయ్య దైద కుమార్ లింగనబోయిన రాజు మంద మొగిలి వారాల లింగయ్య ఆరుట్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు

