విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి
‘మొంథా’ తుఫాన్ సమీపిస్తోంది… అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తీరప్రాంత ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు.
అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు..
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.


