అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 27 (పున్నమి న్యూస్) ప్రతినిధి:
రాష్ట్రంపై మొంధా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని, ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు ఎలమంచిలి నియోజకవర్గ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని *గౌరవ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు అన్నారు* తుఫాన్ వల్ల ధన, ప్రాణ నష్టాలు, జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన *గౌర వ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు* అధికారులకు ఆదేశించడం జరిగింది ,ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మత్తులు ,డ్రైన్లు బలహీనంగా ఉన్న శారదా నది గట్లను, పటిష్ట పరిచేలా, తుఫానుకు విరిగిపడే చెట్లను రోడ్లకు అడ్డం లేకుండా వెనువెంటనే తొలగించేందుకు,యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ఆయన కోరారు. తుఫాన్ పై నిరంతరం సమీక్షలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరికైనా ఎటువంటి అవసరమైన నన్ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో *రాంబిల్లి మండల మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు గారు* మండల ఎమ్మార్వో, ఎండిఓ ,ఏఈ ఇరిగేషన్, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఉద్యోగస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు

మొంథా తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్..!!
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అక్టోబర్ 27 (పున్నమి న్యూస్) ప్రతినిధి: రాష్ట్రంపై మొంధా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని, ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు ఎలమంచిలి నియోజకవర్గ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని *గౌరవ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు అన్నారు* తుఫాన్ వల్ల ధన, ప్రాణ నష్టాలు, జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన *గౌర వ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు* అధికారులకు ఆదేశించడం జరిగింది ,ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మత్తులు ,డ్రైన్లు బలహీనంగా ఉన్న శారదా నది గట్లను, పటిష్ట పరిచేలా, తుఫానుకు విరిగిపడే చెట్లను రోడ్లకు అడ్డం లేకుండా వెనువెంటనే తొలగించేందుకు,యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ఆయన కోరారు. తుఫాన్ పై నిరంతరం సమీక్షలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరికైనా ఎటువంటి అవసరమైన నన్ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో *రాంబిల్లి మండల మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు గారు* మండల ఎమ్మార్వో, ఎండిఓ ,ఏఈ ఇరిగేషన్, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఉద్యోగస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు

