మొoథా తుఫాన్ దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నీ సందర్శించారు. ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
పల్లపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాలలో ఆహారం త్రాగునీరు మందులు మరియు ఇతర నిత్యవసరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాను పరిస్థితి పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సకాలంలో సమాచారా అందించాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం ఫిషింగ్ బోట్లను జెసిబిలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అధికారులందరూ మరియు కంట్రోల్ రూమ్ సిబ్బంది 24X7 అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఊహాగానాలు లేదా పుకార్లు నమ్మవద్దని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఎమర్జెన్సీ కోసం టార్చ్ లైట్లు కొవ్వొత్తులు మరియు బ్యాటరీలను సిద్ధంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ పి అమిత్ బర్దర్, ఆర్డిఓ లోకేశ్వరరావు, డిఆర్ఓ కే పద్మలత పల్లి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


