మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు ,పంట నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు. కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్ళేవారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిధ్ధం అని ఎమ్మెల్యే తెలిపారు

మొంథా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ