గాజువాక: నవంబర్ (పున్నమి ప్రతినిధి)
మొంథా తుఫాను వల్ల తీవ్ర నష్టపోయిన సుమారు 1200 మత్స్యకార కుటుంబాలకు భరోసా కిట్లు అందజేశారు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “జాతీయ విపత్తుల సమయంలో ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే నాయకత్వం చూపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
గాజువాక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మత్స్యకార భరోసా కిట్ల పంపిణీ, తుఫాను బాధితులకు రేషన్ సరఫరా కార్యక్రమాన్ని పల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. దిబ్బపాలెం మరియు గంగవరం ప్రాంతాల నుండి తుఫానుతో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో గాజువాక మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పౌర సరఫరాల అధికారి రవి, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ నాయకులు వెన్నెల ఈశ్వరరావు, నియోజకవర్గ నాయకులు అక్కిన లక్ష్మణరావు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, బలగా బాలు నాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, వియ్యపు నరేష్, ఆఫీజ్, దాట్ల శ్రీనివాసరాజు, దువ్వి శ్రీను, లక్కోజు దేవి, యజ్ఞప్రియ, వనజ, కత్తి తిలక్, రోయ విశ్వనాథం, శ్రీనివాస్ రెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.


