నందిగామ, NTR జిల్లా: మొంథా తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లి, కాలనీలు, రహదారులుమునిగిపోయాయి.
నందిగామ 15వ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మనబోతుల శ్రీరామ, వార్డు అధ్యక్షుడు మనబోతుల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది మరియు వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
పాత బస్టాండ్ నుండి మార్కెట్ యార్డు వరకు హైవే రోడ్డుపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రామన్నపేట రోడ్డులోని రమణ కాలనీ వద్ద వాగు ఉప్పొంగడం తో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌హెచ్-65 (NH-65) వద్ద మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో మహావృక్షం రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ స్థంభించింది. వెంటనే స్పందించిన నందిగామ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీవో, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, కీసర టోల్ ప్లాజా బృందం సహకారంతో వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది.
దేవినేని వెంకటరమణ కాలనీలో నీటి మట్టం అధికంగా ఉండటం తో ప్రజలు బయటకు రావడానికి వీలులేకపోతుంది. పునరావాస కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణచేస్తున్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్డీవో బాలకృష్ణ, ఎంఆర్వో సురేష్ బాబు, కమిషనర్ లోవరాజు సమీక్షిస్తున్నారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
హెచ్చరికగా, ప్రజలు అత్యవసర మైతే తప్ప బయటకు రావొద్దని నందిగామ పోలీసులు మరియు అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

మొంథా తుఫాను ప్రభావం తీవ్రం – నందిగామ పట్టణం వరద ముంపు! అధికారులు అలర్ట్‌లో
నందిగామ, NTR జిల్లా: మొంథా తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లి, కాలనీలు, రహదారులుమునిగిపోయాయి. నందిగామ 15వ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మనబోతుల శ్రీరామ, వార్డు అధ్యక్షుడు మనబోతుల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది మరియు వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పాత బస్టాండ్ నుండి మార్కెట్ యార్డు వరకు హైవే రోడ్డుపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రామన్నపేట రోడ్డులోని రమణ కాలనీ వద్ద వాగు ఉప్పొంగడం తో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్‌హెచ్-65 (NH-65) వద్ద మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో మహావృక్షం రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ స్థంభించింది. వెంటనే స్పందించిన నందిగామ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఆర్డీవో, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, కీసర టోల్ ప్లాజా బృందం సహకారంతో వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది. దేవినేని వెంకటరమణ కాలనీలో నీటి మట్టం అధికంగా ఉండటం తో ప్రజలు బయటకు రావడానికి వీలులేకపోతుంది. పునరావాస కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణచేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్డీవో బాలకృష్ణ, ఎంఆర్వో సురేష్ బాబు, కమిషనర్ లోవరాజు సమీక్షిస్తున్నారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హెచ్చరికగా, ప్రజలు అత్యవసర మైతే తప్ప బయటకు రావొద్దని నందిగామ పోలీసులు మరియు అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం సూచనల మేరకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

