అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:26
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు మేరకు అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిదిలోని జలపాతాలను ఆదివారం నుండి ఈ నెల 28 వరకు మూసివేయడం జరుగుతుందని అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరి పేర్కొన్నారు. కావున అరకు వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వారి అరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఐ సూచించారు. స్థానిక గిరిజనులు భారీ వర్షాలు పడే సమయంలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాలల్లో పోలీసులకు తెలపాలని అరకులోయ ఎస్ఐ జీ గోపాలరావు సూచించారు.

మొంథా తుఫాను ప్రభావంతో మూతపడిన జలపాతాలు
అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:26 ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు మేరకు అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిదిలోని జలపాతాలను ఆదివారం నుండి ఈ నెల 28 వరకు మూసివేయడం జరుగుతుందని అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరి పేర్కొన్నారు. కావున అరకు వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వారి అరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఐ సూచించారు. స్థానిక గిరిజనులు భారీ వర్షాలు పడే సమయంలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాలల్లో పోలీసులకు తెలపాలని అరకులోయ ఎస్ఐ జీ గోపాలరావు సూచించారు.

