మైసూర్ వారి పల్లెలో, దళితుల భూమి ఆక్రమణ..
నిరసన చేపట్టిన బికేఎంయు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 20 ( మనం న్యూస్)
రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లె లో నిరసన చేపట్టిన బికేఎంయు. గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకి చెందిన మినుగు యానాదమ్మ పేరు మీద గత 15 సంవత్సరములకు ముందు రెండు ఎకరాలు డీకేటి పట్టా మంజూరు చేయడం జరిగినది అప్పటినుండి ఇప్పటివరకు మినుగు యానాదమ్మ అనుభవంలో ఉన్నటువంటి భూమిని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు రాత్రికి రాత్రి పెన్సింగ్,ముళ్ల తంతి అక్రమంగా చుట్టూరా తీసి ఆక్రమించుకున్నారని, దళితులు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి రాగానే,పొలం దగ్గరకు వెళ్లి యానాధమ్మ భూమిని పరిశీలించి, ఆమె న్యాయబద్ధమైన నిరసనకు మద్దతుగా, అక్కడే నిరసన చేసిన వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్. దళిత రైతులు పాల్గొనడం జరిగినది. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది


