పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఇవాళ మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా 200 మంది ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్పేర్ అధికారుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య, మార్కెట్ కమిటీ ఇందిరమ్మ కమిటీలు ముస్లిం సోదరీమణులకు అందజేశారు.మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి కృషితో అన్ని వర్గాలకు మేలు, అభివృద్ధి జరుగుతుందని మైనార్టీ నేతలు అన్నారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి దొరికిందని మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి: లక్ష్మారెడ్డి—ముస్లింలకు 200 కుట్టు మిషన్ల పంపిణీ—కాంగ్రెస్ ప్రభుత్వం, KLR కు ధన్యవాదాలు: మైనార్టీ నేతలు*