*మైదుకూరు లో మూత్రశాలలు లేక ఇబ్బందులు*. .
ఊరంతా చుట్టాలే ఉ.. పోసుకోవడానికి తావులేదు అన్న సామెత మైదుకూరులో గుర్తొస్తోందంటున్నారు ప్రజలు. .
ఊర్లో ఇంత అభివృద్ధి చెందుతున్న ఉ.. పోసుకోవడానికి ప్రజలకు మరుగుదొడ్లు లేని పరిస్థితి..
నిత్యం మైదుకూరు పట్టణం కు అనేక గ్రామాల నుండివేలసంఖ్యలో ప్రజలు మహిళలు పనుల నిమిత్తం కూరగాయలు ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం వస్తుంటారు..
మగవారైతే ఎలాగోలా పాటుపడతారు గాని అత్యవసర పరిస్థితి లో మహిళలు మూత్రశాలకు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ..
గతంలో పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్లు ఉండేవి నేడు అవి కనిపించడం లేదు..
నిత్యం రద్దీగా ఉండే బద్వేల్ రోడ్డు కడప రోడ్డు లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే మహిళలకు సౌకర్యంగా ఉంటుందంటున్నా ఇతర ప్రాంతాల ప్రజలు..
బద్వేల్ రోడ్డులో మురికి కాలువలపై మరుగుదొడ్లు నిర్మించడం ..కడప రోడ్డులో గతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ప్రక్కన మరుగుదొడ్డి నిర్మించడం మేలంటున్నారు ప్రజలు..
ప్రజల అవస్థలు ముఖ్యంగా మహిళల అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల తో మున్సిపాలిటీ అధికారులు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

