మేడిపల్లి నక్కర్త
గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు
*కొలువు తీరిన కొత్త పాలకవర్గం*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం
నియోజకవర్గం ఇంచార్జ్:
పున్నమి ప్రతినిధి:
23 డిసెంబర్ 2025
మేడిపల్లి నక్కర్త లోని గ్రామ పంచాయతీలలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
రెండేళ్ల విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడడంతో దీంతో గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.
మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామాలలో నియమించిన ప్రత్యేక అధికారులచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను అప్పగించారు.
గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు వాయిదా పడటం, సుమారు 22 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు కొత్త పాలకవర్గాల రాకతో ఆశలు చిగురించాయి.


