Tuesday, 3 March 2026
  • Home  
  • మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం*
- విశాఖపట్నం

మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం*

*మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం* * *ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు* *విశాఖపట్నం, న‌వంబ‌ర్ పున్నమి ప్రతినిధి: క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే అంచ‌నాల‌తోనే స‌త్ఫ‌లితాలు సాధించగలుగుతామని ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు తెలిపారు. క‌మిటీ స‌భ్యులు ఏలూరి సాంబ‌శివ‌రావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి. సూర్యనారాయణ రాజు, వరుదు కళ్యాణిల‌తో క‌లిసి బుధ‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంతరం విసీ హాలులో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో జిల్లాలో చేప‌ట్టిన అభివృద్ది ప‌నులు, రూపొందించిన అంచ‌నాలు, వ్యయం త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జిల్లా అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. అలాగే మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌స్తుతం ఇరిగేష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఉంద‌ని, దానికి మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి జీవీఎంసీకి అప్ప‌గించేందుకు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్ర‌భుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. స‌భ్యులు ప‌లు అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లతో పాటు ప్రాజెక్టుల వ్య‌యం, అంచ‌నాల రూప‌క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై వారి అభిప్రాయాల‌ను తెలిపారన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్దయెత్తున ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా అధికారులు కృషి చేయాల‌ని సూచించినట్లు తెలిపారు.* *కమిటీ సభ్యులు వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో బడ్జెట్ అలకేషన్ చేసిందో, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా రివ్యూ చేస్తూ, ఆ యొక్క లక్ష్యాలు చేరుకోగలిగామా లేదా, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే భవిష్యత్తులో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఎలాంటి మార్పులు చేయాలనేదాని పై డిపార్ట్‌మెంట్ల యొక్క హెడ్స్‌తో ఒక డీటెయిల్ రివ్యూ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆయా డిపార్ట్‌మెంట్ల యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన నిధులు, వాటిని ఖర్చు పెట్టాల్సిన తీరులో తీసుకోవాల్సిన మార్పులు కూడా కొన్ని చర్చించడం జరిగిందిని తెలిపారు. ఆయా జిల్లాలకు ఉన్న ప్రాధాన్యతలు, మేరకు అంటే విశాఖ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, అదేవిధంగా పర్యాటక రంగంలో కావచ్చు, ఈ రకంగా అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద మహానగరం. ఇది భారతదేశంలోనే ఒక విశిష్టతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి ఒక ముఖద్వారంగా పెట్టుబడులకి దీనిని అభివృద్ధి చేయడంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి అవసరాలు వీటికి అవసరం ఉన్నదో కూడా పరిశీలించి, రాబోవు బడ్జెట్‌లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇవ్వడం ద్వారా విశాఖ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ కూడా సహకరిస్తుందని తెలిపారు*. *కమిటీ సభ్యురాలు శ్రీమతి వరద కళ్యాణి మాట్లాడుతూ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిసి విశాఖపట్నం కలెక్టరేట్లో రివ్యూ చేయడం జరిగిందని, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో ఏ ఏ ఎస్టిమేట్స్ ఏ ఏ వర్క్స్ కి ఇచ్చారు అనే దాని మీద రివ్యూ చేయడం జరిగిందన్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వివరించారని తెలిపారు. ఈ డిస్ట్రిక్ట్స్ కిఏమి అవసరమో అనేది కూడా కలెక్టర్ కమిటీకి వివరించారని, అవన్నీ కూడా మా కమిటీ తరపున ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు*.

*మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం*
*
*ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు*

*విశాఖపట్నం, న‌వంబ‌ర్ పున్నమి ప్రతినిధి: క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే అంచ‌నాల‌తోనే స‌త్ఫ‌లితాలు సాధించగలుగుతామని ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు తెలిపారు. క‌మిటీ స‌భ్యులు ఏలూరి సాంబ‌శివ‌రావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి. సూర్యనారాయణ రాజు, వరుదు కళ్యాణిల‌తో క‌లిసి బుధ‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంతరం విసీ హాలులో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో జిల్లాలో చేప‌ట్టిన అభివృద్ది ప‌నులు, రూపొందించిన అంచ‌నాలు, వ్యయం త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జిల్లా అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. అలాగే మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌స్తుతం ఇరిగేష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఉంద‌ని, దానికి మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి జీవీఎంసీకి అప్ప‌గించేందుకు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్ర‌భుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. స‌భ్యులు ప‌లు అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లతో పాటు ప్రాజెక్టుల వ్య‌యం, అంచ‌నాల రూప‌క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై వారి అభిప్రాయాల‌ను తెలిపారన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్దయెత్తున ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా అధికారులు కృషి చేయాల‌ని సూచించినట్లు తెలిపారు.*

*కమిటీ సభ్యులు వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో బడ్జెట్ అలకేషన్ చేసిందో, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా రివ్యూ చేస్తూ, ఆ యొక్క లక్ష్యాలు చేరుకోగలిగామా లేదా, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే భవిష్యత్తులో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఎలాంటి మార్పులు చేయాలనేదాని పై డిపార్ట్‌మెంట్ల యొక్క హెడ్స్‌తో ఒక డీటెయిల్ రివ్యూ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆయా డిపార్ట్‌మెంట్ల యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన నిధులు, వాటిని ఖర్చు పెట్టాల్సిన తీరులో తీసుకోవాల్సిన మార్పులు కూడా కొన్ని చర్చించడం జరిగిందిని తెలిపారు. ఆయా జిల్లాలకు ఉన్న ప్రాధాన్యతలు, మేరకు అంటే విశాఖ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, అదేవిధంగా పర్యాటక రంగంలో కావచ్చు, ఈ రకంగా అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద మహానగరం. ఇది భారతదేశంలోనే ఒక విశిష్టతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి ఒక ముఖద్వారంగా పెట్టుబడులకి దీనిని అభివృద్ధి చేయడంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి అవసరాలు వీటికి అవసరం ఉన్నదో కూడా పరిశీలించి, రాబోవు బడ్జెట్‌లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇవ్వడం ద్వారా విశాఖ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ కూడా సహకరిస్తుందని తెలిపారు*.

*కమిటీ సభ్యురాలు శ్రీమతి వరద కళ్యాణి మాట్లాడుతూ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిసి విశాఖపట్నం కలెక్టరేట్లో రివ్యూ చేయడం జరిగిందని, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో ఏ ఏ ఎస్టిమేట్స్ ఏ ఏ వర్క్స్ కి ఇచ్చారు అనే దాని మీద రివ్యూ చేయడం జరిగిందన్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వివరించారని తెలిపారు. ఈ డిస్ట్రిక్ట్స్ కిఏమి అవసరమో అనేది కూడా కలెక్టర్ కమిటీకి వివరించారని, అవన్నీ కూడా మా కమిటీ తరపున ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.