49వ వార్డు బూత్ నెం.245 పరిధిలో స్థానిక నాయకులు నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లో శంకర రావు పాల్గొన్నారు.
శంకర రావు ప్రతి గడపకు వెళ్లి ప్రజల నుండి ప్రైవేటీకరణ వ్యతిరేక సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ —
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేసే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
ప్రైవేటీకరణ వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్య అందుబాటులో లేకపోవడమే కాకుండా, ప్రజలకు చవకగా వైద్యం అందకపోవడం, వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు, జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రొంగళి చంద్రమౌళి, జిల్లా విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పల్లా చైతన్య, వార్డు జనరల్ సెక్రటరీ జి. వెంకటరావు, సెక్రటరీ జె.డి. ప్రశాంత్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, యూత్ అధ్యక్షుడు యిగలపాటి రాజేష్, బి.సి. అధ్యక్షుడు కూన డిల్లీ రావు, గ్రీవెన్స్ అధ్యక్షుడు బోర సూరిబాబు, ఐటీ విభాగం అధ్యక్షుడు అత్తిలి నరేంద్ర కుమార్ (నందు), బి.సి. పబ్లిసిటీ విభాగ అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, వార్డు ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు కొణాతల అరుణ, సీనియర్ నాయకులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


