గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):
గాజువాక నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం 67వ వార్డు గౌరీ పరమేశ్వరుల గుడి దగ్గర ప్రారంభమైంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తైనాలా విజయకుమార్ హాజరై, సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఇబ్రాన్, గుడివాడ లతీష్, పల్లా చిన్నతల్లి, కొయ్య భారతి, పూర్ణ, పల్లా సురేష్ కుమార్, మంత్రి శంకర్ నారాయణ, ధర్మాల శ్రీను, బొడ్డ గోవింద్, మద్దాల అప్పారావు, సంద్రనా నూకరాజు, శ్రీనివాసరావు, మార్థుపూడి పరదేశి, రాజన వెంకటరావు, గొందేశీ మహేష్ రెడ్డి, ఎం.డి. గౌష్, అచ్చయ్య నాయుడు, చిత్రాడ రమణ, ఎన్నేటి రమణ, రోజా రాణి, కల్పనా, రామలక్ష్మి, ఈశ్వరి, మునిషా భేగాం, సత్యవతి, ఉమా, అన్నపూర్ణ, సూర్య, లక్ష్మి, కుమార్, హుసేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతంగా సాగి, ప్రజల్లో మంచి స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.


