Friday, 6 February 2026
  • Home  
  • మెడికల్ కాలేజీలపై వైసీపీ డ్రామాలు – ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి
- విశాఖపట్నం

మెడికల్ కాలేజీలపై వైసీపీ డ్రామాలు – ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ముందుకు వెళ్తుంటే, వైసీపీ నాయకులు కుట్రలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ విమర్శించారు. కోటి సంతకాలు పేరుతో వైసీపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి పనులు వదిలేయడం, రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం ప్రజలకు గుర్తుందన్నారు. పీపీపీ విధానమే మెడికల్ కాలేజీల అభివృద్ధికి సరైన మార్గమని వైసీపీ ఎంపీలే పార్లమెంట్‌లో చెప్పి, ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి, వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎస్.మురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ముందుకు వెళ్తుంటే, వైసీపీ నాయకులు కుట్రలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ విమర్శించారు.
కోటి సంతకాలు పేరుతో వైసీపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి పనులు వదిలేయడం, రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం ప్రజలకు గుర్తుందన్నారు.
పీపీపీ విధానమే మెడికల్ కాలేజీల అభివృద్ధికి సరైన మార్గమని వైసీపీ ఎంపీలే పార్లమెంట్‌లో చెప్పి, ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
ఈ సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు మానాపురం గణపతి, వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎస్.మురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.