వైద్య కళాశాలలను, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైసిపి స్టేట్ కౌన్సిల్ నెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, స్టేట్ వైసిపి మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి ఎంపీపి, ఆర్థర్ సైమాన్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసిపి మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్ వైసీపీ జిల్లా సెక్రెటరీలు దేవనగర్ బాషా, శివనాగిరెడ్డి, సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ గోస్పాడు మండలం వైసిపి అధ్యక్షుడు పి పి రాజశేఖర్ రెడ్డి నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తమ రెడ్డి విజయ శేఖర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జులు, సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నేతల ఆధ్వర్యంలో, వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానందా రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ కళాశాలల్లో 750 మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో నంద్యాల ఉండటం, అందులో చదివిన ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణం అన్నారు. నంద్యాల మెడికల్ కళాశాలకు 16 పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు. అలాగే 11 డిస్టింక్షన్ లు సాధించారని చెప్పారు. ఇటువంటి సమయంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని, పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్ష గట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. 2లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని ప్రగల్బాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలకు 5వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు, వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకు రావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.


