Sunday, 14 December 2025
  • Home  
  • మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు*
- విశాఖపట్నం

మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు*

*ఏయూ తెలుగు విభాగం ఆల్ టైం రికార్డ్* ,*మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు* *నూతన టీచర్లకు ఆచార్య *జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 52 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు దక్కించుకున్నారు.. శనివారం ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా తాజాగా కొలువులు పొందిన 52 మందిని తెలుగు విభాగం శాఖ అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారంతా ఎంతో ధన్యజీవులు అన్నారు.. యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు తొలుత ఆర్ట్స్ గ్రూపులతోనే ప్రారంభించారన్నారు.. ఆ తర్వాత దశల వారీగా ఏయుని ఎంతోమంది అభివృద్ధి చేశారన్నారు.. నేడు ప్రపంచంలోనే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు.. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు.. కార్యక్రమం నిర్వాహకులు ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ ఎంతో మందిని ఈ సమాజానికి అందించిన ఘనత ఏయూకే దక్కుతుందన్నారు.. తన హయాంలో ఏకకాలంలో ఒకే డీఎస్సీలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడం తనకు చిరస్థాయిగా మధురానుభూతిని మిగిలిస్తుందన్నారు.. నూతనంగా కొలువులు పొందిన టీచర్లు అందర్నీ తాను సత్కరించడంతో పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చేయాలని సూచించానన్నారు… ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అంతకు మించిన గౌరవం లభించేది అన్నారు కాబట్టి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అప్పారావు కోరారు….. గౌరవ ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు.. బహు గ్రంథకర్త.. లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత.. గౌరవాచార్యులు వెలమల సిమ్మన్న.. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ సత్యనారాయణ లు మాట్లాడుతూ తెలుగు విభాగానికి వెలుగులు నింపిన ఘనత ఆచార్య అప్పారావు కే దక్కుతుందన్నారు.. దేశానికి ఎంతోమంది ప్రముఖులు అందించిన ఘనత ఏయు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.. ఈ కార్యక్రమంలో పద్మాలయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఆచార్య మధుజ్యోతి. .. ఏయ్ సీనియర్ ఆచార్యులు గజ్జ యోహాను బాబు.. అంబేద్కర్ యూనివర్సిటీ అధ్యాపకురాలు అన్నం రెడ్డి ఈశ్వరమ్మ..మరో అధ్యాపకురాలు ప్రవీణ.. పలువురు పరిశోధక విద్యార్థులు.. పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.. ఏయూ పరిశోధక విద్యార్థి జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు

*ఏయూ తెలుగు విభాగం ఆల్ టైం రికార్డ్*

,*మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు*

*నూతన టీచర్లకు
ఆచార్య *జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం*

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి*

ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 52 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు దక్కించుకున్నారు.. శనివారం ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా తాజాగా కొలువులు పొందిన 52 మందిని తెలుగు విభాగం శాఖ అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య
ఎ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారంతా ఎంతో ధన్యజీవులు అన్నారు.. యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు తొలుత ఆర్ట్స్ గ్రూపులతోనే ప్రారంభించారన్నారు.. ఆ తర్వాత దశల వారీగా ఏయుని ఎంతోమంది అభివృద్ధి చేశారన్నారు.. నేడు ప్రపంచంలోనే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు.. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు.. కార్యక్రమం నిర్వాహకులు ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ ఎంతో మందిని ఈ సమాజానికి అందించిన ఘనత ఏయూకే దక్కుతుందన్నారు.. తన హయాంలో ఏకకాలంలో ఒకే డీఎస్సీలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడం తనకు చిరస్థాయిగా మధురానుభూతిని మిగిలిస్తుందన్నారు.. నూతనంగా కొలువులు పొందిన టీచర్లు అందర్నీ తాను సత్కరించడంతో పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చేయాలని సూచించానన్నారు… ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అంతకు మించిన గౌరవం లభించేది అన్నారు కాబట్టి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అప్పారావు కోరారు….. గౌరవ ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు.. బహు గ్రంథకర్త.. లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత.. గౌరవాచార్యులు వెలమల సిమ్మన్న.. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ సత్యనారాయణ లు మాట్లాడుతూ
తెలుగు విభాగానికి వెలుగులు నింపిన ఘనత ఆచార్య అప్పారావు కే దక్కుతుందన్నారు.. దేశానికి ఎంతోమంది ప్రముఖులు అందించిన ఘనత ఏయు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.. ఈ కార్యక్రమంలో పద్మాలయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఆచార్య మధుజ్యోతి. .. ఏయ్ సీనియర్ ఆచార్యులు గజ్జ యోహాను బాబు.. అంబేద్కర్ యూనివర్సిటీ అధ్యాపకురాలు అన్నం రెడ్డి ఈశ్వరమ్మ..మరో అధ్యాపకురాలు ప్రవీణ.. పలువురు పరిశోధక విద్యార్థులు.. పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.. ఏయూ పరిశోధక విద్యార్థి జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.