*మృతుల కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ 10,000 ఆర్థిక సాయం*
పున్నమి ప్రతినిధి నవంబర్ 02
కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ ఎల్లమ్మ శుక్రవారం సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎల్లమ్మ మృతదేహానికి పూలమాలేసి నివాళులర్పించారు. తదుపరి ఎల్లమ్మ కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఎక్కువయి పల్లి బి ఆర్ ఎస్ . నాయకులు 5000 అందించారు అలాగే కడ్తాల్ మండల కేంద్రానికి బీఆర్ఎస్ నాయకులు పోతుగళ్ళ మహేష్ శుక్రవారం హార్ట్ ఎటాక్ తో మరణించారు. మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ట్రస్టు ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ వీరయ్య సేవ్య నాయక్ వెంకటయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ సర్పంచ్ వెంకటేష్ మాజీ ఉపసర్పంచ్ ముత్యాలు నాయకులు బిక్షపతి పాండు మహేష్ కిష్టయ్య రాకేష్ రాజేష్ నవీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


