ముస్తాబాద్ / పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి
స్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు గారి జన్మదినం సందర్భంగా ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే.కే. మహేందర్ రెడ్డి గారు పాల్గొని గజ్జెల రాజు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అభివృద్ధి కోసం రాజు గారు చేస్తున్న సేవలను మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. ముస్తాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.


