విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి. విశాఖ నగరంలో కాలువల ద్వారా మునిగినీరు సముద్రంలో కలుషితం కాకుండా పటిష్ట చర్యలు అలాగే నగరంలో మురుగునీరు శుద్ధికి ప్రత్యేక ప్రణాళికలను చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. శుక్రవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ , ఇతర అధికారులతో కలిసి గాదిరాజు ప్యాలెస్ వద్ద ఉన్న ప్రధాన కాలువను ,పాండురంగపురం బీచ్ సమీపంలో ఉన్న ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ విశాఖ సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా పర్యావరణహితంగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దే ప్రణాళికలను చేపడుతున్నామన్నారు.
విశాఖ నగరంలో ప్రజల తాగునీటికి, ఇతర వినియోగాల కొరకు 380 నీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని, అందులో 263 ఎమ్.ఎల్.డి వినియోగపు నీటిగా బయటికి రావడం జరుగుతున్నదని , 263 ఎం ఎల్ డి నీటిలో ఇప్పటికే 179 ఎంఎల్డి నీటిని శుద్ధి చేయడం జరుగుతున్నదన్నారు. మిగిలిన 54 ఎంఎల్ డి అలాగే మరొక 25 ఎంఎల్డి అమృత 2.0 పథకంలో శుద్ధికి ప్రణాళికలు జరుగుతున్నదని తెలిపారు. విశాఖ నగరంలో గల సముద్రంలో ఒక్క చుక్క కూడా మురుగునీరు సముద్రంలో కలవకుండా, బీచ్ కలుషితం కాకుండా నగరంలో వస్తున్న నీటిని శత శాతం శుద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. ఆ దిశగా విశాఖ నగరంలో బీచ్ లో కలుస్తున్న పలు కాలువలను నేడు పరిశీలించడం జరిగిందన్నారు. 25 కాలువల ద్వారా విశాఖ బీచ్ లో మురుగునీరు కలుస్తుండగా , ఇప్పటికే 13 కాలువలను యు జి డి కాలువలలకు అనుసంధానం చేయడమైనది అన్నారు. మిగిలిన వాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురుగనీరు శుద్ధికి ప్రణాళికలను చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కు ఆదేశించడం అయినది అన్నారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో కాలువలు ద్వారా వస్తున్న నీరు శత శాతం పూర్తిగా శుద్ధి చేయడం పూర్తవుతుందన్నారు. పది రోజుల్లో విశాఖ నగరానికి మరల సందర్శించి నగరంలో గల శాసనసభ్యులతో సంప్రదించి వారి సలహాలపై చర్చించి విశాఖ నగర సముద్రంలో కాలువల ద్వారా మురుగునీరు సముద్రంలో కలవకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే పూర్తి ప్రణాళికలను రూపొందిస్తామని ఆ దిశగా జీవీఎంసీ కమిషనర్ కు చర్యలు చేపట్టాలని ఆదేశించడం అయినది అన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, టిడిపి నాయకులు గంటా రవితేజ, జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి వివి సత్యనారాయణ రాజు ,ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్లు, కార్యనిర్వాక ఇంజనీర్లు,, సహాయక వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు

