Story highlights
- డా.
- బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రెడ్డివారిపాలెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రెడ్డివారిపాలెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో యల్లమెల్లి సీతామహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అర కాసు బంగారం, నాలుగు వెండి కుంకుమభరిణలు, రూ.50 వేల నగదు, ఎల్‌ఈడీ టీవీ అపహరించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముమ్మిడివరంలో వరుస చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.