నందిగామ, గురువారం నందిగామ నియోజక వర్గంలోని ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ₹2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇటీవల నందిగామ పర్యటనలో భాగంగా ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ — “దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందిన ముప్పాళ్ళ గ్రామానికి అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రెండు కోట్ల నిధులను మంజూరు చేసినందుకు సీఎం కు హృదయపూర్వక ధన్య వాదాలు. గ్రామ ప్రజలసంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
గ్రామంలో రోడ్లు, తాగునీటి సదు పాయాలు, శానిటేషన్, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముప్పాళ్ళ గ్రామ ప్రజలు సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని హర్షిస్తూ, తమ గ్రామ అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.

*ముప్పాళ్ళ గ్రామాభివృద్ధికి సీఎం నారా చంద్రబాబునాయుడు నుండి ₹2 కోట్ల నిధుల మంజూరు*
నందిగామ, గురువారం నందిగామ నియోజక వర్గంలోని ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ₹2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇటీవల నందిగామ పర్యటనలో భాగంగా ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ — “దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందిన ముప్పాళ్ళ గ్రామానికి అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రెండు కోట్ల నిధులను మంజూరు చేసినందుకు సీఎం కు హృదయపూర్వక ధన్య వాదాలు. గ్రామ ప్రజలసంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సదు పాయాలు, శానిటేషన్, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముప్పాళ్ళ గ్రామ ప్రజలు సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని హర్షిస్తూ, తమ గ్రామ అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.

