మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
తెలంగాణ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా వడ్డీలేని రుణాల కోసం రూ.41.20కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీటికి సంబంధించి సీడీఎంఏ తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆరు మున్సిపాలిటీలకు అభివృద్ది పనుల నిమిత్తం మున్సిపల్ శాఖ రూ.90 (ఒక్కో మున్సిపాలిటీకి రూ.15కోట్లు) కోట్లు కేటాయిచింది. కేటాయించింది~£


