నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా పరిధిలోని వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథంలో జిల్లా యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. ఈనెల 13న రాంనగర్ మున్సిపల్ పార్కులో పెద్ద ఎత్తున కుక్కల దత్తత కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ప్రకటించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుక్కల వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తో పాటు, ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. కుక్కలు కరువకుండా జాగ్రత్తలు, కరిచిన పక్షంలో వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారని వెల్లడించారు.

మున్సిపల్ పార్కులో కుక్కల దత్తత కార్యక్రమంను ప్రారంభించనున్న : రాష్ట్ర మంత్రి
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా పరిధిలోని వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథంలో జిల్లా యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. ఈనెల 13న రాంనగర్ మున్సిపల్ పార్కులో పెద్ద ఎత్తున కుక్కల దత్తత కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ప్రకటించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుక్కల వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తో పాటు, ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. కుక్కలు కరువకుండా జాగ్రత్తలు, కరిచిన పక్షంలో వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారని వెల్లడించారు.

