Tuesday, 24 March 2026
  • Home  
  • మున్సిపల్ ‘కోఆప్షన్’పై.. పొలిటికల్ హీట్.. ! మైనారిటీ కోటాకు గట్టి పోటీ.. నేతల చుట్టూ ఆశావహుల ప్రసన్నం ప్రదక్షిణలు..
- సూర్యాపేట

మున్సిపల్ ‘కోఆప్షన్’పై.. పొలిటికల్ హీట్.. ! మైనారిటీ కోటాకు గట్టి పోటీ.. నేతల చుట్టూ ఆశావహుల ప్రసన్నం ప్రదక్షిణలు..

సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకంపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మున్సిపల్ పాలకవర్గం కొలువు -దీరడంతో ఆశావహులందరూ కో-ఆప్షన్ పదవులపై దృష్టి సారించారు. *గత నెల 16న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మెన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.. ముఖ్యంగా మైనారిటీ కోటాకు సంబంధించిన కో-ఆప్షన్ పదవికి గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను -నియమించాల్సి ఉంటుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ -విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. కౌన్సిలర్లతో సమాన హోదా కలిగిన ఈ సభ్యులు కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే చైర్మెన్, వైస్ చైర్మెన్ -ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు ఉండదు. సూర్యాపేట మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో మైనారిటీ వర్గానికి ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు ఉండగా, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించనున్నారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, సామాజిక సేవలో అనుభవం ఉన్న మహిళలు, పట్టణ ప్రణాళిక లేదా ప్రభుత్వ విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉండనుంది. ముస్లిం మైనారిటీ కోటా నుండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, వక్స్ బోర్డు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ వైస్ చైర్మెన్ అబూబకర్ సిద్దిక్, సీనియర్ నాయకులు ఖాజా ఇస్రార్ అహ్మద్, మన్సూర్ ఆర్టిస్ట్, ఖమ్రుద్దీన్, నీడ్స్ సాజిద్, గౌస్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో సీనియర్ నాయకులు, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసినవారు ఉండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పలువురు ఆశావహులు ఏఐసీసీ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరికి కో-ఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ రాని వారు, పోటీ నుంచి తప్పుకున్న వారు, రిజర్వేషన్ల కారణంగా అవకాశం కోల్పోయిన సీనియర్లు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో పోటీ అధికంగా ఉంటే కౌన్సిలర్లతో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళిక విభాగంలో పని చేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్డు అయిన ఉద్యోగులు కో-ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్లు పని చేసిన వారూ అర్హులే అవుతారు. ఇదిలావుండగా ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లో ఒకరికి ఇవ్వాలని భావిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్తో సమాన హోదా కో-ఆప్షన్ సభ్యులకు ఉంటుంది. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. పాలకవర్గం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. పాలన, సమస్యలపై చర్చించే వీలుంటుంది. కానీ అభివృద్ధి పనులు తీర్మానంలో వీరి పాత్ర ఉండదు. సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాని పక్షంలో సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ వేతనం కూడా ఉంటుంది. కో-ఆప్షన్ పదవి దక్కాలంటే కౌన్సిల్ ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి 21 సంవత్సరాలు దాటిన వారు అర్హులు అవుతారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవుల కోసం రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొనగా, తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకంపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మున్సిపల్ పాలకవర్గం కొలువు -దీరడంతో ఆశావహులందరూ కో-ఆప్షన్ పదవులపై దృష్టి సారించారు. *గత నెల 16న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మెన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే..
ముఖ్యంగా మైనారిటీ కోటాకు సంబంధించిన కో-ఆప్షన్ పదవికి గట్టి పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యులను -నియమించాల్సి ఉంటుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ -విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. కౌన్సిలర్లతో సమాన హోదా కలిగిన ఈ సభ్యులు కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే చైర్మెన్, వైస్ చైర్మెన్ -ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు ఉండదు. సూర్యాపేట మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో మైనారిటీ వర్గానికి ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు ఉండగా, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించనున్నారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, సామాజిక సేవలో అనుభవం ఉన్న మహిళలు, పట్టణ ప్రణాళిక లేదా ప్రభుత్వ విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉండనుంది. ముస్లిం మైనారిటీ కోటా నుండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, వక్స్ బోర్డు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ వైస్ చైర్మెన్ అబూబకర్ సిద్దిక్, సీనియర్ నాయకులు ఖాజా ఇస్రార్ అహ్మద్, మన్సూర్ ఆర్టిస్ట్, ఖమ్రుద్దీన్, నీడ్స్ సాజిద్, గౌస్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో సీనియర్ నాయకులు, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసినవారు ఉండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పలువురు ఆశావహులు ఏఐసీసీ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరికి కో-ఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ రాని వారు, పోటీ నుంచి తప్పుకున్న వారు, రిజర్వేషన్ల కారణంగా అవకాశం కోల్పోయిన సీనియర్లు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో పోటీ అధికంగా ఉంటే కౌన్సిలర్లతో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు, పురపాలనలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లేదా పట్టణ ప్రణాళిక విభాగంలో పని చేసి గెజిటెడ్ అధికారి హోదాలో రిటైర్డు అయిన ఉద్యోగులు కో-ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్లు పని చేసిన వారూ అర్హులే అవుతారు. ఇదిలావుండగా ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లో ఒకరికి ఇవ్వాలని భావిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్తో సమాన హోదా కో-ఆప్షన్ సభ్యులకు ఉంటుంది. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. పాలకవర్గం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. పాలన, సమస్యలపై చర్చించే వీలుంటుంది. కానీ అభివృద్ధి పనులు తీర్మానంలో వీరి పాత్ర ఉండదు. సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాని పక్షంలో సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. గౌరవ వేతనం కూడా ఉంటుంది. కో-ఆప్షన్ పదవి దక్కాలంటే కౌన్సిల్ ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి 21 సంవత్సరాలు దాటిన వారు అర్హులు అవుతారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవుల కోసం రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొనగా, తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.