ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల, సమ్మెలో భాగంగా 3 రోజు , సర్వోదయ కళాశాల నుండి, అంబేద్కర్ విగ్రహం వీఆర్సీ వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ *జిల్లా కార్యదర్శి కె. పెంచల నరసయ్య, నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు* మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు గత మూడు రోజుల నుండి సమ్మెలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణం. చాలీచాలని వేతనాలతో ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అప్పులు పాలవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసిన వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదు. అర్ధాంతరంగా ఇళ్లకు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల తో చర్చలు జరిపి సమ్మె పరిష్కరించాలని, లేదంటే 17వ తేదీ నుండి సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండా ప్రసాద్, మాల కొండయ్య, నరసింహారెడ్డి, లవన్ ఇంజనీరింగ్ కార్మికుల నాయకులు ఎం. శ్రీనివాసులు, కే. బాలు, ముని, మోహన్ కృష్ణ , మారుతి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల అర్ధ నగ్న ప్రదర్శన
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల, సమ్మెలో భాగంగా 3 రోజు , సర్వోదయ కళాశాల నుండి, అంబేద్కర్ విగ్రహం వీఆర్సీ వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ *జిల్లా కార్యదర్శి కె. పెంచల నరసయ్య, నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు* మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు గత మూడు రోజుల నుండి సమ్మెలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణం. చాలీచాలని వేతనాలతో ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అప్పులు పాలవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసిన వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదు. అర్ధాంతరంగా ఇళ్లకు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల తో చర్చలు జరిపి సమ్మె పరిష్కరించాలని, లేదంటే 17వ తేదీ నుండి సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండా ప్రసాద్, మాల కొండయ్య, నరసింహారెడ్డి, లవన్ ఇంజనీరింగ్ కార్మికుల నాయకులు ఎం. శ్రీనివాసులు, కే. బాలు, ముని, మోహన్ కృష్ణ , మారుతి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.