నందిగామ, బుధవారం మొంథా తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మునేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, మునేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఎగువప్రాంతాల నుంచి అధికంగా వస్తున్న వరద నీరు బుధవారం రాత్రి నాటికి దిగువ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతర సమాచారం అందించాలి. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలి,” అని తెలిపారు.
అదనంగా, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించా లంటూ అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నది పరివాహక ప్రాంతాల గ్రామాలు, వంతెనలు, రహదారుల పరిస్థితులను నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.

మునేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, బుధవారం మొంథా తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మునేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, మునేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఎగువప్రాంతాల నుంచి అధికంగా వస్తున్న వరద నీరు బుధవారం రాత్రి నాటికి దిగువ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతర సమాచారం అందించాలి. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలి,” అని తెలిపారు. అదనంగా, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించా లంటూ అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే, నది పరివాహక ప్రాంతాల గ్రామాలు, వంతెనలు, రహదారుల పరిస్థితులను నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.

