రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,అక్టోబర్16,(పున్నమి ప్రతినిధి):
సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక కొరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోవడానికి మునుగోడుకు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతితో పిసిసి పరిశీలకులు వచ్చారు.మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ముఖ్య కార్యకర్త ఏఐసీసీ బీసీ ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,ఓసిలలో ఎవరిని డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేసిన మా మద్దతు ఉంటుందని,దాంతోపాటు అధిష్టానం మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన కమిట్మెంట్ కూడా నిలబెట్టుకోవాలని కుండ బద్దలు కొట్టినట్టు ఏకవాఖ్య తీర్మానాన్ని తెలిపారు.ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వున్నపుడు రాజగోపాల్ రెడ్డిగారు పార్టీని బ్రతికించారని గుర్తు చేశారు.2009 నుండి ఈరోజు వరకు ప్రతిపక్షాలకు ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెడుతున్నాడని,మొన్నటికి మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని ఎంపీగా గెలిపించి సత్తా చాటాడని అన్నారు.ఎంపీగా గెలిపించి వస్తే మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చి హామీను నిలబెట్టుకోలేదన్న విషయాన్ని ఏఐసిసి మాజీ జనరల్ సెక్రెటరీకి తెలిపారు.మంత్రి పదవి ఇచ్చి మాట తప్పిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు ముఖ్య నాయకులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రాజగోపాల్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో పేరున్న నాయకుడని,ఆయన స్థాయికి మంత్రి పదవి చిన్నదని,ఇంకా పెద్ద పదవులు అధిష్టించే సత్తా ఉన్న నాయకుడని విశ్వరంజన్ మహంతి కొనియాడారు.ఖచ్చితంగాఆయన ఆవేదనను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని,మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి,ఆయనకు అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఏఐసిసి ప్రతినిధి ద్వారా రిపోర్ట్ పంపిస్తామని ఎమ్మెల్సీ,ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు.


