Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Telangana

మునగాకు తినాలి అనేక రకాల జబ్బులకు దివ్య ఔషధం

Punnami Newsroom Published:
మునగాకు తినాలి అనేక రకాల జబ్బులకు దివ్య ఔషధం

Story highlights

  • డాక్టర్ దూపం పావని పున్నమి ప్రతినిధి దూపం అంజనేయులు జులై 15 అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఫస్ట్ ఇయర్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టూడెంట్, బి జె హెచ్ పి ఎస్ సోషల్ మీడియా…
  • అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
  • మునగాకులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా వున్నాయి.అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

డాక్టర్ దూపం పావని
పున్నమి ప్రతినిధి దూపం అంజనేయులు జులై 15 అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఫస్ట్ ఇయర్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టూడెంట్, బి జె హెచ్ పి ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు ఆయన కుమార్తె, డాక్టర్ దూపం పావని పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా వున్నాయి.అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగాఝ ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి,అలాగే తల్లి పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే వారికి మునగాకు వరప్రదాయిని. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు, నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, ‘సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మి గ్రా, ఎనర్జీ 97 కేలరీలు ఉంటాయి అని ఆమె తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *