పున్నమి నవంబర్ 07 ప్రతినిధి దూపం అంజనేయులు హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి ముదిరాజ్ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ఇంటర్నల్ లైన్స్ నిర్మాణానికి సంబంధించిన లెవెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కాలనీ ఏర్పడి చాలా సంవత్సరాలు గడిచినా భూగర్భ డ్రైనేజ్ సదుపాయం లేకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వాహిని, సూపర్వైజర్ బాలు, ముదిరాజ్ కాలనీ యువజన సంఘం అధ్యక్షులు మధు, శ్రీనివాస్ అలాగే కాలనీవాసులు పాల్గొన్నారు.

ముదిరాజ్ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ఇంటర్నల్ లైన్స్ నిర్మాణానికి ప్రణాళిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి