Tuesday, 24 March 2026
  • Home  
  • ముచ్చివోలులో ఘనంగా మహా కుంభాభిషేక వేడుకలు – భక్తి పరవశంలో గ్రామం
- తిరుపతి

ముచ్చివోలులో ఘనంగా మహా కుంభాభిషేక వేడుకలు – భక్తి పరవశంలో గ్రామం

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన ముచ్చివోలు గ్రామంలో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న యాగాలు, ధార్మిక క్రతువులు బుధవారం నాడు ప్రధాన ఘట్టంతో ముగియనున్నాయి. ఉదయం నుంచే ముచ్చివోలు శ్రీరామ సేవా సమితి హరేరామ భజన బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:48 నుంచి 9:52 గంటల మధ్య ఉన్న శుభ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం యంత్ర స్థాపన, దేవస్య బింబ స్థాపన, విమాన కుంభాభిషేకం జరుగుతుంది. భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు గో దర్శనం, కన్యా దర్శనం, వేద ఆశీర్వచనాలు కల్పించనున్నారు. కుంభాభిషేకం అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. భక్తులందరికీ విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు తిరుపమల తిరుపతి దేవస్థానం వారి ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని గ్రామ సర్పంచ్, శ్రీరామ సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.