ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 21(పున్నమి ప్రతినిధి)
ఎమ్మిగనూరు పట్టణ వివిధ వార్డులకు చెందిన 26 మంది బాధితులకు రూ. 9. 68 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 122 మంది బాధితులు రూ. 1.12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారుఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


