Tuesday, 24 March 2026
  • Home  
  • ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్*
- విశాఖపట్నం

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్*

*ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి మ‌ధురువాడ ఐటీ హిల్స్ పై సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) స‌మావేశం జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో అధికారుల‌తో మాట్లాడారు. ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం హిల్ నెం.3 వ‌ద్దకు నేరుగా ముఖ్య‌మంత్రి చేరుకోకున్న క్ర‌మంలో అక్క‌డ‌ హెలిప్యాడ్ ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు.

*ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్*

*విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి మ‌ధురువాడ ఐటీ హిల్స్ పై సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) స‌మావేశం జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో అధికారుల‌తో మాట్లాడారు. ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం హిల్ నెం.3 వ‌ద్దకు నేరుగా ముఖ్య‌మంత్రి చేరుకోకున్న క్ర‌మంలో అక్క‌డ‌ హెలిప్యాడ్ ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.