ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్ గురుకుల విద్యార్థికి చికిత్స కోసం సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా రూ.10 లక్షలు విడుదల చేసిన ముఖ్యమంత్రి
జీబీ సిండ్రోమ్ తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్
మంత్రి డా.స్వామి ప్రత్యేక చొరవతో విద్యార్థికి విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యం
విద్యార్థి వైద్యం కోసం సీఎం.ఆర్.ఎఫ్ ఎల్వోసీ ద్వారా రూ.10 లక్షలు సాయం
పేదింటి విద్యార్థి ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు
పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం


