నావీ కార్యకలాపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేవీ మ్యూజియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నావీ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
—
తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసింది
తైవాన్ ప్రతినిధి బృందం నేత ముమిన్ చెన్ ముఖ్యమంత్రిని కలసి, రూ. 400 కోట్ల వ్యయంతో కుప్పంలో ఇండో–తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఈవీ బ్యాటరీల రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపిన ప్రాజెక్టులు:
పౌచెన్ గ్రూప్ – కుప్పంలో ఫుట్వేర్ తయారీ యూనిట్
క్రియేటివ్ సెన్సర్స్ ఇన్క్. – ఒర్వకల్లో ఇమేజ్ సెన్సర్స్ యూనిట్
ఈ-సోల్ ఇండియా – ఒర్వకల్లో USD 2.2 బిలియన్ వ్యయంతో అధునాతన బ్యాటరీ తయారీ యూనిట్
ముఖ్యమంత్రిని సమక్షంలో తైవాన్ ప్రతినిధులు – ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపాదిత పార్కులకు ఉత్తమ కనెక్టివిటీ అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్ రంగానికి ప్రోత్సాహక ప్యాకేజీని త్వరలో ప్రకటించబోతోందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య ఉద్యోగులను తయారు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని తైవాన్ బృందాన్ని కోరారు.
—
ఇటలీ రాయబారి ముఖ్యమంత్రిని కలిశారు
ఇటలీ రాయబారి ఆంటోనియో హెన్రికో బార్టోలీ ముఖ్యమంత్రిని కలసి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆటోమొబైల్, ఆటో స్పేర్స్, మెషినరీ, ఫ్యాషన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అలాగే అగ్రిటెక్, పునరుత్పత్తి శక్తి (రిన్యూవబుల్ ఎనర్జీ), షిప్ బిల్డింగ్ రంగాల్లో ఇటలీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే అవకాశంపై చర్చలు జరిగాయి.


