Thursday, 12 February 2026
  • Home  
  • ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖ
- విశాఖపట్నం

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖను ఈ రోజు జగదాంబ వద్ద గల సీఐటీయూ జిల్లా కార్యాలయం లో మీడియాకు విడుదల చేసారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు తో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి కుమార్, బి జగన్, వి కృష్ణా రావు లు పాల్గొన్నారు… విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. *విషయం: గూగుల్పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి.* అయ్యా! అమెరికా తరువాత అతిపెద్ద డేటా సెంటర్ రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల (లక్షా 25 వేల కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పనున్నట్లు ఢిల్లీలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత మీరు ప్రకటించారు. దానితో పాటు ఏఐ హబ్్న కూడా నెలకొల్పబోతున్నట్లు చెప్పారుసహజంగానే ఇది ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతులైన యువతరంలో అనేక ఆశలు రేకెత్తించింది. దీనికోసం 500 ఎకరాలు కేటాయించారు. గూగుల్ అదానీ కనెక్స్, ఏయిర్టెల్ కమ్యూనికేషన్స్ కూడా భాగస్వాములవుతున్నాయి. లక్షా 80 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖా మాత్యులు నారా లోకేష్ ప్రకటించారు. ఈ విజయాన్ని చూసి ఇరుగు, పొరుగు రాష్ట్రాల వారు అసూయపడుతున్నట్లుగా, ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలే అన్ని ఉద్యోగాలు రావని, పర్యావరణానికి నష్టం ఉంటుందని చెప్పక తప్పలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా 5-6 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని పరోక్షంగా ఇంకో 30 వేల మందికి ఉపాధి దొరకొచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చెబుతున్నదే వాస్తవం అయితే ప్రతిపక్షాల దృష్ప్రచారం నిలబడదు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇటీవల మీడియాలో వస్తున్న విభిన్న కథనాలు, వివిధ దేశాల అనుభవాలు పరిశీలిస్తే దీనిపై వాస్తవాలతో నిమిత్తం లేకుండా అతిశయోక్తులతో ప్రచారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది సమస్యలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నాను. (1) అమెరికా తరువాత అతి పెద్ద డేటా సెంటర్ (1 గిగావాట్) కోసం విశాఖపట్నంలో గూగుల్ అత్యధిక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ద్వారా సముద్ర గర్భం నుండి కేబుల్ కనెక్షన్ల ద్వారా 12 దేశాల అనుసంధానించిన గేట్వేగా ఉ ండబోతున్నది. తద్వారా గూగుల్ వ్యాపారం ప్రపంచమంతటా విస్తరించడానికి విశాఖపట్నం డేటా సెంటర్ దోహదం చేస్తుంది. దీనివల్ల గూగుల్కు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ల్కో ఏ విధంగా లాభం చేకూరుస్తుంది? (2) గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, అనకాపల్లి జిల్లాలోనూ 480 ఎకరాలు కేటాయించారు. ఇందులో పంటలు పండే భూములున్నాయి, దళితుల అసైన్డ్ భూములున్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారు. ఉదా:- తరువాడ గ్రామంలో దళితులు జీవన భృతిని కోల్పోతామంటూ ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సింహాచలం దేవస్థానం క్రింద పంచ గ్రామాల ప్రజలు ఇళ్ళపట్టాలకోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవివరంలో గూగుల్ కోసం భూములు కేటాయించారు. ఇదేమి న్యాయం? 2019లో మీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం 70 వేల కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వం 2023లో అదానీ కనెక్స్ట్ మరలా ఒప్పందం చేసుకొని డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు కేటాయించింది. అందులో 130 ఎకరాలు (రుషికొండ -3 చుట్టూ) కోటి రూపాయల చొప్పున రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అదానీ డేటా సెంటర్ పెట్టలేదు. ఉపాధీ కల్పించలేదు. ఇప్పుడు గూగుల్ జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఈ స్థితిలో అదానీకి కేటాయించిన భూముల్ని గూగుల్ డేటా, ఎఐ హబ్బుకోసం కేటాయించాలి. ఆ భూములు ఖాళీగా పెట్టి మరోచోట తిరిగి రైతుల భూములు సేకరించడం సమంజసం కాదు. పైగా అభివృద్ధి పేరుతో ప్రజల మనోభావాలను ముందుకు తెచ్చి నష్టపోతున్న రైతుల నోళ్ళు నొక్కడం సరైంది కాదు. (1) రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు వైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్పై 10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు. ఒక్క కంపెనీ కూడా ప్రారంభంకాలేదు. (3) ఇలాంటి డేటా సెంటర్ ద్వారా 5-6 వేలకు మించి ప్రత్యక్ష ఉద్యోగాలు రావని నిపుణులు చెప్తున్నారు. విశాఖలో ఒక పెద్ద డేటా సెంటర్ను మానిటరింగ్ చేయడానికి, దానికి అనుబంధంగా విద్యుత్, నీళ్ళు వగైరాల సరఫరాకు ఎంతమంది ఉద్యోగులు: అవసరం అవుతారో గూగుల్తో జరిగిన ఒప్పందంలో నిర్దిష్టంగా హామీ ఇచ్చారా? వారు తీసుకునే సిబ్బందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మందిని తీసుకుంటారు? గత అనుభవాలను బట్టి వివిధ పరిశ్రమల్లో స్థానికులకు చాలా తక్కువ ఉద్యోగాలే లభించాయన్నది వాస్తవం ప్రపంచం అంతటా ఐటి ఉద్యోగాల్లో కోత పడుతోందన్న వాస్తవం మీకు తెలుసు, ఇందులో మన రాష్ట్రం వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. ఉదా:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బిసిఎస్ గత మూడు మాసాల్లో 20 వేల మంది మధ్యంతర సిబ్బందిని తొలగించింది. కొత్తగా 10 వేల మందిని తీసుకుంటామని ప్రకటించింది. ఎఐ ప్రభావంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వగైరా ప్రఖ్యాత కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఈ స్థితిలో ఎఐ హబ్బులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ఖచ్చితమైన అంచనా వేసిందా? ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరుతున్నాను. వాస్తవాలతో నిమిత్తం లేని లెక్కలు భవిష్యత్తులో యువతరాన్ని మరింత అసంతృప్తికి గురిచేయవా? (4) రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే గూగుల్ లాంటి కంపెనీలు అనేకం వాటంతట అవే వచ్చి ఉండేవి. ఈ పాటికి విశాఖ. సహా రాష్ట్రం మరో అడుగు ముందుకేసి ఉండేది. ఇప్పుడు 22 వేల కోట్లు ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడండి. (5) జి.వో.40లో పేర్కొన్న విధంగా గూగుల్ డేటా సెంటర్కు వివిధ రూపాల్లో 22 వేల కోట్లు రాయితీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీకి ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయితీల ద్వారా రాష్ట్రానికి వస్తున్న లాభం ఎంత? భూములు త్యాగం చేసిన రైతులకు జరుగుతున్న లాభం ఏమిటీ? కనీసం ఈ మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా ఎందుకు తీసుకోలేదు? (6) విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ పెడితే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పర్యావరణ మార్పులతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్ ద్వారా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేదా? డేటా సెంటర్కు అవసరమైన 2 వేల మెగా వాట్ల విద్యుత్, రోజుకి 80 ఎంజిడి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? దీని ప్రభావం విశాఖ, అనకాపల్లి జిల్లాలపై ఎలా ఉంటుండో పరిశీలించి నిర్ధారణ చేశారా? (7) భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సర్వీసులు దీనితో అనుసంధానించబడతాయి. తద్వారా పడిపోతున్న ఐటి కంపెనీల లాభాలు తిరిగి పుంజుకోవచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత, అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ సమాచారానికి భద్రత ఏమిటి? ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలు దీనిని దుర్వినియోగం చేయకుండా ఒప్పందంలో ఏమైనా షరతులు ఉన్నాయా? 2023లో పార్లమెంటు ముందుంచిన వ్యక్తిగత డేటా ప్రైవసీ బిల్లు ఇంత వరకు చట్టరూపం తీసుకోలేదు. బడా బటి కంపెనీల ఒత్తిడితోనే దానిని ఆపి ఉ ంచారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రజలడేటా ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి పోతున్నది. గూగుల్ డేటా సెంటర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం రాదా? అనేక దేశాల్లో ప్రభుత్వ డేటా ప్రభుత్వంరంగ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. మనదేశంలోనూ సి-డాక్, ఎన్ఐసి వంటి సంస్థలున్నాయి. ఇప్పుడు ప్రయివేటు ఐటి కంపెనీలు లాభాపేక్షతో వాటిని ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వమే అవసరమైన డేటా సెంటర్లు పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల, ప్రభుత్వ డేటాకు భద్రతా ఉంటుంది. పై అంశాలను సమగ్రంగా పరిశీలించి నిష్ణాతుల అభిప్రాయాలు, అంతర్జాతీయ అనుభవాలు తీసుకొని ప్రజలకు నష్టంకాని రీతిలో గూగుల్ డేటా సెంటర్పై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉద్యోగభద్రతకు కంపెనీల నుండి గ్యారెంటీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి శ్రీనివాసరావు బహిరంగ లేఖను ఈ రోజు జగదాంబ వద్ద గల సీఐటీయూ జిల్లా కార్యాలయం లో మీడియాకు విడుదల చేసారు.
ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు తో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి కుమార్, బి జగన్, వి కృష్ణా రావు లు పాల్గొన్నారు…
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి.

*విషయం: గూగుల్పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి.*

అయ్యా!

అమెరికా తరువాత అతిపెద్ద డేటా సెంటర్ రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల (లక్షా 25 వేల కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పనున్నట్లు ఢిల్లీలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత మీరు ప్రకటించారు. దానితో పాటు ఏఐ హబ్్న కూడా నెలకొల్పబోతున్నట్లు చెప్పారుసహజంగానే ఇది ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతులైన యువతరంలో అనేక ఆశలు రేకెత్తించింది. దీనికోసం 500 ఎకరాలు కేటాయించారు. గూగుల్ అదానీ కనెక్స్, ఏయిర్టెల్ కమ్యూనికేషన్స్ కూడా భాగస్వాములవుతున్నాయి. లక్షా 80 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖా మాత్యులు నారా లోకేష్ ప్రకటించారు.

ఈ విజయాన్ని చూసి ఇరుగు, పొరుగు రాష్ట్రాల వారు అసూయపడుతున్నట్లుగా, ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలే అన్ని ఉద్యోగాలు రావని, పర్యావరణానికి నష్టం ఉంటుందని చెప్పక తప్పలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా 5-6 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని పరోక్షంగా ఇంకో 30 వేల మందికి ఉపాధి దొరకొచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చెబుతున్నదే వాస్తవం అయితే ప్రతిపక్షాల దృష్ప్రచారం నిలబడదు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇటీవల మీడియాలో వస్తున్న విభిన్న కథనాలు, వివిధ దేశాల అనుభవాలు పరిశీలిస్తే దీనిపై వాస్తవాలతో నిమిత్తం లేకుండా అతిశయోక్తులతో ప్రచారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది సమస్యలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నాను.

(1) అమెరికా తరువాత అతి పెద్ద డేటా సెంటర్ (1 గిగావాట్) కోసం విశాఖపట్నంలో గూగుల్ అత్యధిక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ద్వారా సముద్ర గర్భం నుండి కేబుల్ కనెక్షన్ల ద్వారా 12 దేశాల అనుసంధానించిన గేట్వేగా ఉ ండబోతున్నది. తద్వారా గూగుల్ వ్యాపారం ప్రపంచమంతటా విస్తరించడానికి విశాఖపట్నం డేటా సెంటర్ దోహదం చేస్తుంది. దీనివల్ల గూగుల్కు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ల్కో ఏ విధంగా లాభం చేకూరుస్తుంది?

(2) గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, అనకాపల్లి జిల్లాలోనూ 480 ఎకరాలు కేటాయించారు. ఇందులో పంటలు పండే భూములున్నాయి, దళితుల అసైన్డ్ భూములున్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారు. ఉదా:- తరువాడ గ్రామంలో దళితులు జీవన భృతిని కోల్పోతామంటూ ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సింహాచలం దేవస్థానం క్రింద పంచ గ్రామాల ప్రజలు ఇళ్ళపట్టాలకోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవివరంలో గూగుల్ కోసం భూములు కేటాయించారు. ఇదేమి న్యాయం?

2019లో మీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం 70 వేల కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వం 2023లో అదానీ కనెక్స్ట్ మరలా ఒప్పందం చేసుకొని డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు కేటాయించింది. అందులో 130 ఎకరాలు (రుషికొండ -3 చుట్టూ) కోటి రూపాయల చొప్పున రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అదానీ డేటా సెంటర్ పెట్టలేదు. ఉపాధీ కల్పించలేదు. ఇప్పుడు గూగుల్ జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఈ స్థితిలో అదానీకి కేటాయించిన భూముల్ని గూగుల్ డేటా, ఎఐ హబ్బుకోసం కేటాయించాలి. ఆ భూములు ఖాళీగా పెట్టి మరోచోట తిరిగి రైతుల భూములు సేకరించడం సమంజసం కాదు. పైగా అభివృద్ధి పేరుతో ప్రజల మనోభావాలను ముందుకు తెచ్చి నష్టపోతున్న రైతుల నోళ్ళు నొక్కడం సరైంది కాదు. (1)
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు వైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్పై 10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు. ఒక్క కంపెనీ కూడా ప్రారంభంకాలేదు.

(3) ఇలాంటి డేటా సెంటర్ ద్వారా 5-6 వేలకు మించి ప్రత్యక్ష ఉద్యోగాలు రావని నిపుణులు చెప్తున్నారు. విశాఖలో ఒక పెద్ద డేటా సెంటర్ను మానిటరింగ్ చేయడానికి, దానికి అనుబంధంగా విద్యుత్, నీళ్ళు వగైరాల సరఫరాకు ఎంతమంది ఉద్యోగులు: అవసరం అవుతారో గూగుల్తో జరిగిన ఒప్పందంలో నిర్దిష్టంగా హామీ ఇచ్చారా? వారు తీసుకునే సిబ్బందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మందిని తీసుకుంటారు? గత అనుభవాలను బట్టి వివిధ పరిశ్రమల్లో స్థానికులకు చాలా తక్కువ ఉద్యోగాలే లభించాయన్నది వాస్తవం

ప్రపంచం అంతటా ఐటి ఉద్యోగాల్లో కోత పడుతోందన్న వాస్తవం మీకు తెలుసు, ఇందులో మన రాష్ట్రం వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. ఉదా:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బిసిఎస్ గత మూడు మాసాల్లో 20 వేల మంది మధ్యంతర సిబ్బందిని తొలగించింది. కొత్తగా 10 వేల మందిని తీసుకుంటామని ప్రకటించింది. ఎఐ ప్రభావంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వగైరా ప్రఖ్యాత కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఈ స్థితిలో ఎఐ హబ్బులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ఖచ్చితమైన అంచనా వేసిందా? ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరుతున్నాను. వాస్తవాలతో నిమిత్తం లేని లెక్కలు భవిష్యత్తులో యువతరాన్ని మరింత అసంతృప్తికి గురిచేయవా?

(4) రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే గూగుల్ లాంటి కంపెనీలు అనేకం వాటంతట అవే వచ్చి ఉండేవి. ఈ పాటికి విశాఖ. సహా రాష్ట్రం మరో అడుగు ముందుకేసి ఉండేది. ఇప్పుడు 22 వేల కోట్లు ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడండి.

(5) జి.వో.40లో పేర్కొన్న విధంగా గూగుల్ డేటా సెంటర్కు వివిధ రూపాల్లో 22 వేల కోట్లు రాయితీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీకి ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయితీల ద్వారా రాష్ట్రానికి వస్తున్న లాభం ఎంత? భూములు త్యాగం చేసిన రైతులకు జరుగుతున్న లాభం ఏమిటీ? కనీసం ఈ మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా ఎందుకు తీసుకోలేదు?

(6) విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ పెడితే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పర్యావరణ మార్పులతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్ ద్వారా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేదా?
డేటా సెంటర్కు అవసరమైన 2 వేల మెగా వాట్ల విద్యుత్, రోజుకి 80 ఎంజిడి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? దీని ప్రభావం విశాఖ, అనకాపల్లి జిల్లాలపై ఎలా ఉంటుండో పరిశీలించి నిర్ధారణ చేశారా?

(7) భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సర్వీసులు దీనితో అనుసంధానించబడతాయి. తద్వారా పడిపోతున్న ఐటి కంపెనీల లాభాలు తిరిగి పుంజుకోవచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత, అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ సమాచారానికి భద్రత ఏమిటి? ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలు దీనిని దుర్వినియోగం చేయకుండా ఒప్పందంలో ఏమైనా షరతులు ఉన్నాయా? 2023లో పార్లమెంటు ముందుంచిన వ్యక్తిగత డేటా ప్రైవసీ బిల్లు ఇంత వరకు చట్టరూపం తీసుకోలేదు. బడా బటి కంపెనీల ఒత్తిడితోనే దానిని ఆపి ఉ ంచారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రజలడేటా ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి పోతున్నది. గూగుల్ డేటా సెంటర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం రాదా?

అనేక దేశాల్లో ప్రభుత్వ డేటా ప్రభుత్వంరంగ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. మనదేశంలోనూ సి-డాక్, ఎన్ఐసి వంటి సంస్థలున్నాయి. ఇప్పుడు ప్రయివేటు ఐటి కంపెనీలు లాభాపేక్షతో వాటిని ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వమే అవసరమైన డేటా సెంటర్లు పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల, ప్రభుత్వ డేటాకు భద్రతా ఉంటుంది.
పై అంశాలను సమగ్రంగా పరిశీలించి నిష్ణాతుల అభిప్రాయాలు, అంతర్జాతీయ అనుభవాలు తీసుకొని ప్రజలకు నష్టంకాని రీతిలో గూగుల్ డేటా సెంటర్పై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉద్యోగభద్రతకు కంపెనీల నుండి గ్యారెంటీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.