రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. రోగుల భద్రత కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి స్వయంగా రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అభినందించారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ధ్యేయంగా ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 150 మందికి కొత్త చూపు