Thursday, 5 March 2026
  • Home  
  • మిరాయ్ హిట్ తో మావూళ్లమ్మతల్లి ఆలయంలో పూజలు*
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మిరాయ్ హిట్ తో మావూళ్లమ్మతల్లి ఆలయంలో పూజలు*

* కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోని మిరాయ్ సినిమా సూపర్ హిట్ తో కాట్రేనికోన మావుళ్లమ్మతల్లి దేవాలయంలో సినీనటుడు పుష్ప సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన పీపుల్స్ మీడియా నిర్మాతలకు , దర్శకులకు సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు . మావుళ్లమ్మ తల్లి ఆలయం వద్ద నాటకాలు, భజనలు చేసిన తనకు అమ్మ వారి ఆశీస్సులతో నటుడిగా పుష్ప సినీరంగంలో గుర్తింపునిస్తే మిరాయ్ సినిమా మరింత పేరును తీసుకొచ్చిందని పుష్ప సురేష్ శర్మ అన్నారు . ఇప్పటి వరకు సుమారు 200కు పైగా టీవీ సీరియళ్లు , 150చిత్రాల్లో తనకు నటుడుగా అవకాశం దొరకడం మావుళ్లమ్మ తల్లి ఆశీస్సులే అన్నారు . ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ల ఫణికాంత్ మిరాయ్ నటులతో పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేసారు . ఈసందర్భంగా నటుడు సురేష్ శర్మను బ్రాహ్మణసంఘ నాయకులు డీసీసీ అధికార ప్రతినిధి కంచుస్తంభం సోనీ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, తాతపూడి గోపి, ఆణి విళ్ళ ఫణికాంత్ , శంకర్ దేవాసి ,ఈశ్వర్, రవివర్మ , రామకృష్ణ పరమహంస,పవన్, తంబి, తదితరులు సత్కరించారు .

*

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోని మిరాయ్ సినిమా సూపర్ హిట్ తో కాట్రేనికోన మావుళ్లమ్మతల్లి దేవాలయంలో సినీనటుడు పుష్ప సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన పీపుల్స్ మీడియా నిర్మాతలకు , దర్శకులకు సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు . మావుళ్లమ్మ తల్లి ఆలయం వద్ద నాటకాలు, భజనలు చేసిన తనకు అమ్మ వారి ఆశీస్సులతో నటుడిగా పుష్ప సినీరంగంలో గుర్తింపునిస్తే మిరాయ్ సినిమా మరింత పేరును తీసుకొచ్చిందని పుష్ప సురేష్ శర్మ అన్నారు . ఇప్పటి వరకు సుమారు 200కు పైగా టీవీ సీరియళ్లు , 150చిత్రాల్లో తనకు నటుడుగా అవకాశం దొరకడం మావుళ్లమ్మ తల్లి ఆశీస్సులే అన్నారు .
ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ల ఫణికాంత్ మిరాయ్ నటులతో పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేసారు . ఈసందర్భంగా నటుడు సురేష్ శర్మను బ్రాహ్మణసంఘ నాయకులు డీసీసీ అధికార ప్రతినిధి కంచుస్తంభం సోనీ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, తాతపూడి గోపి, ఆణి విళ్ళ ఫణికాంత్ , శంకర్ దేవాసి ,ఈశ్వర్, రవివర్మ , రామకృష్ణ పరమహంస,పవన్, తంబి, తదితరులు సత్కరించారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.