Thursday, 5 February 2026
  • Home  
  • మా జెండా తెలుగుదేశం.. మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మా జెండా తెలుగుదేశం.. మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..

వింజమూరు నవంబర్ 01 పున్నమి పత్రిక ప్రతినిధి మా జెండా తెలుగుదేశం అని మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని మేమంతా ఒకటేనని, మా మధ్య వర్గ విభేదాలు లేవని, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు, వనిపెంట సుబ్బారెడ్డి, , మాజీ ఎంపీపీ, ఇనగనూరి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మండల నాయకులు అందరు ఒకే వేదికపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి లు మాట్లాడుతూ వైసిపి పార్టీకి ఉన్న పత్రికలో రోత రాతలు రాస్తున్నారని, మా మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని, మాకు వర్గాలు లేవని మాదంతా తెలుగుదేశం కుటుంబమని, మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని తెలిపారు. వింజమూరుకు చెందిన ఒక వైసీపీ నాయకుడు చేసిన కుట్ర ఫలించలేదు అన్నారు. అందుచేత వారి దినపత్రికలో అబూత కల్పనలతో రాశారన్నారు. మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మేమే సర్దుకుంటామని, వాటిని రాజకీయం చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేశారన్నారు. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారమే, ఇదంతా జరిగిందని, మాలో ఎవరు గెలిచినా ఒకటేనన్నారు. అలా జరిగి ఉండకూడదని, ఇప్పటికి కూడా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. మా అందరి లక్ష్యం ఒకటేనని వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీని ఎదుర్కొని, టిడిపి విజయాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, అడుగుజాడల్లో నడిచి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తామన్నారు. ముగ్గురు నాయకులు కలసికట్టుగా చేతులు కలుపుకొని విక్టరీ చూపించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కాటం రమణారెడ్డి, దంతులూరి వెంకటేశ్వర్లు, పాములపాటి మాల్యాద్రి, గురజాల వాసు నాయుడు, షేక్ రఫీ, గంగపట్ల హాజరత్, గవ్వల మల్లికార్జున, ఉప్పుటూరు రత్నం, గాలి శేషయ్య, ఎం రాయుడు, తిరుపతి ఆచారి, దుద్దుగుంట శ్రీనివాసులురెడ్డి, కే ఎస్ నాయుడు, బి జయంత్ రెడ్డి, జి రామచంద్రారెడ్డి, భోజనపు ఆనంద్, తదితరులు ఉన్నారు.

వింజమూరు నవంబర్ 01 పున్నమి పత్రిక ప్రతినిధి

మా జెండా తెలుగుదేశం అని మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని మేమంతా ఒకటేనని, మా మధ్య వర్గ విభేదాలు లేవని, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు, వనిపెంట సుబ్బారెడ్డి, , మాజీ ఎంపీపీ, ఇనగనూరి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మండల నాయకులు అందరు ఒకే వేదికపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి లు మాట్లాడుతూ వైసిపి పార్టీకి ఉన్న పత్రికలో రోత రాతలు రాస్తున్నారని, మా మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని, మాకు వర్గాలు లేవని మాదంతా తెలుగుదేశం కుటుంబమని, మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని తెలిపారు. వింజమూరుకు చెందిన ఒక వైసీపీ నాయకుడు చేసిన కుట్ర ఫలించలేదు అన్నారు. అందుచేత వారి దినపత్రికలో అబూత కల్పనలతో రాశారన్నారు. మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మేమే సర్దుకుంటామని, వాటిని రాజకీయం చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేశారన్నారు. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారమే, ఇదంతా జరిగిందని, మాలో ఎవరు గెలిచినా ఒకటేనన్నారు. అలా జరిగి ఉండకూడదని, ఇప్పటికి కూడా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. మా అందరి లక్ష్యం ఒకటేనని వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీని ఎదుర్కొని, టిడిపి విజయాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, అడుగుజాడల్లో నడిచి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తామన్నారు. ముగ్గురు నాయకులు కలసికట్టుగా చేతులు కలుపుకొని విక్టరీ చూపించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కాటం రమణారెడ్డి, దంతులూరి వెంకటేశ్వర్లు, పాములపాటి మాల్యాద్రి, గురజాల వాసు నాయుడు, షేక్ రఫీ, గంగపట్ల హాజరత్, గవ్వల మల్లికార్జున, ఉప్పుటూరు రత్నం, గాలి శేషయ్య, ఎం రాయుడు, తిరుపతి ఆచారి, దుద్దుగుంట శ్రీనివాసులురెడ్డి, కే ఎస్ నాయుడు, బి జయంత్ రెడ్డి, జి రామచంద్రారెడ్డి, భోజనపు ఆనంద్, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.