
- నిస్సహాయ తండ్రి అభ్యర్ధన
- దాతలు కోసం పడిగాపులు
- పత్రికా ప్రతినిధుల సహాయం కోరిన బాధిత కుటుంబం
(అరసవల్లి – )
మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ .. ఒక తండ్రి ఆవేదన అందరినీ కలచివేసింది. అరసవల్లి స్థానిక ఆదిత్యనగర్ లో నివాసముంటున్న కళ్లేపల్లి. రమేష్ కుమార్, కుమారుడు లీలసాయి కృష్ణ ఊపిరితిత్తుల సంక్రమణ (ఇన్ఫెక్షన్)తో గత ఆరునెలల నుండి బాధపడుతున్నారు. తల్లి టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు.
తండ్రి రమేష్ కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమవ్వగా, కొడుకు పరిస్థితి దీనస్థాయిలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్ధికంగా ఎటువంటి వెసులుబాటు లేకపోవటంతో, మంగళవారం పత్రికా ప్రతినిధుల సహాయం కోరారు. ఈ సందర్భంగా కళ్లేపల్లి. రమేష్ కుమార్ ప్రతినిధులతో మాట్లాడుతూ కుమారునకు ఊపిరితిత్తులలో నీరు చేరిందని, నగరానికి చెందిన వైద్యులు చింతాడ భాస్కర్ తెలిపారని, బ్రాన్కో స్కోపీ పరీక్షలను విశాఖపట్టణంలో చేయించి మెరుగైనవైద్యం అందించాలని, ఆరోగ్యశ్రీ కూడా వర్తించదన్నారు. వైద్య పరీక్షలకు, మందులకు సుమారు లక్ష రూపాయల వరకు అవసరముందని, ప్రస్తుతానికి రెండు నెలలకు సరిపడే మందులను వాడాలని, వేక్షిణ్ వేశారని, ఇది సంవత్సరానికి ఒక సారి వాడాలని చెప్పారన్నారు.
మెరుగైన చికిత్సకు ఆర్ధిక స్థోమత అడ్డంకిగా ఉందని, మనసున్న దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని, (పింఛన్) సదరన్ సర్టిఫికెట్ ఇంకా మంజూరు కాలేదని, ఏ ఆధారం లేదని కన్నీటిపరవంతమయ్యారు. దాతలు నేరుగా గాని, లీలకృష్ణ తల్లి కళ్లేపల్లి.సుజాత ఫోన్ పే (9381442744) ద్వారా గాని సహాయమందించాలని కోరారు.

