పలమనేరు, జూన్ 30 2020(పున్నమి విలేకరి): పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో పలమనేరు బజార్ వీధిలో పలమనేరు ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు ధరించ కుండా నిబంధనలను అతిక్రమించిన వారికి రూ135/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.