“మాలలకు ఆలయంలోకి ప్రవేశం లేదు”
-దళితులపై వివక్ష
-ఆలయంలోకి రాకుండా అడ్డగింత
– గుడికి తాళం
దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా…తరాల నుంచి పాతుకుపోయిన అంటరానితనం రోగం వదలడంలేదు.
ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు.దొరవారిసత్రం మండలం పాళెం పాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామదేవతకి ఆదివారం గ్రామంలోని దళితులు పొంగళ్లు పెట్టేందుకు ఆలయానికి వెళ్లారు. ఆ ఆలయ పూజారి దళితులకు గుడిలోకి ప్రవేశం లేదని ఆలయానికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో దళితులు ఆలయం ముందు నిరసన చేశారు.దొరవారిసత్రం మండలం పాలేం పాడు గ్రామానికి చెందిన దళితులను కోరిందమ్మ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.ఆధునిక యుగంలోనూ అంటరానితనం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. దళితులపై వేధింపులు నేటికి కొనసాగుతున్నాయి. దొరవారిసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో ఆదివారం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, అగ్రకులస్తులు గుడికి తాళం వేశారు. దొరవారి సత్రంమండలం పాలెంపాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామ దేవతకి పొంగళ్లు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చారు. అయితే వారిని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అగ్రకులస్తులు గుడిలోకి రానివ్వకుండా గుడి పూజారి చేత అలాలు వేయించి . తమను గుడిలోకి వెళ్లనివ్వకుండా తాళం వేశారని దళితులు ఆరోపించారు. ఆలయంలోకి రాకుండా చేశారని దళితులు అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు.


