కలిగిరి, మార్చి (పున్నమి ప్రతినిధి)
మార్కాపురం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతదేహం కలిగిరి మండలం నాగసముద్రం గ్రామానికి చేరడంతో విషాద వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, స్థానికులు బోరున విలపించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నివాళులు అర్పించారు. కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్షణ ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల చదువు, భవిష్యత్తుకు సహాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.



